బ్రేకింగ్ – ఏపీలో రెండు వారాల పాటు కర్ఫ్యూ – షాపులకి సమయం ఇదే

బ్రేకింగ్ - ఏపీలో రెండు వారాల పాటు కర్ఫ్యూ - షాపులకి సమయం ఇదే

0
87
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. వేలాది కేసులు వస్తున్నాయి.. ఇక ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు దిగుతోంది.. ఎల్లుండి నుంచి అమల్లోకి వచ్చేలా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు.
ఇక తర్వాత ఎవరూ షాపులు తీయకూడదు, జనం రోడ్లపైకి రాకూడదు, దీని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేస్తారు. ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మెడికల్ ఎమెర్జెన్సీ ఇలాంటి అత్యవసర సర్వీసులకి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే కచ్చితంగా కారణం చెప్పాలి బయటకు వచ్చిన సమయంలో.
బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ కొనసాగనుంది.రోజు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి ఏపీలో ఎక్కడా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు… దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు..
లాక్ డౌన్ విషయంలో ఎక్కడిక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది.. అందుకే ఏపీలో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని జగన్ సర్కారు భావించింది.