బ్రేకింగ్ – ఆస్టేట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజులే వర్కింగ్ డేస్ కీలక నిర్ణయం

బ్రేకింగ్ - ఆస్టేట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజులే వర్కింగ్ డేస్ కీలక నిర్ణయం

0
88

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో చాలా స్టేట్స్ అనేక ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు అవుతోంది. అయితే పలు చోట్ల లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు.. భారీగా కేసులు నమోదు అవ్వడంతో పలు గ్రామాల్లో పట్టణాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అలాగే కఠిన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.

 

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, మాస్క్ లు, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ఇక ముంబైలో పరిస్దితి చూశాం ఇక మధ్యప్రదేశ్ లో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, దాదాపు

నాలుగు వేల కేసులు నిన్న నమోదు అయ్యాయి.

 

అయితే తాజాగా ఇక్కడ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది….ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయని సీఎంవో స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్ 8 నుంచి ఈ విధానం మూడు నెలల పాటు అమలు చేస్తారు.

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతనలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పట్టణాల్లో 10 గంటల నుంచి రాత్రి కర్ఫూ అమలులో ఉంటుంది.. ఉదయం ఆరు గంటల వరకూ ఇలా కర్ఫూ ఉంటుంది అని తెలిపారు.