బ్రేకింగ్ – ఎటీఎం విత్ డ్రా ఇక 5000 మాత్రమేనా?

బ్రేకింగ్ - ఎటీఎం విత్ డ్రా ఇక 5000 మాత్రమేనా?

0
104

ఈ కరోనా వైరస్ చాలా కుటుంబాల్లో విషాదం నింపింది, అయితే ఆర్దిక ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి, ఈ సమయంలో చాలా మందికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమయంలో తాజాగా మరో పిడుగులాంటి వార్త అందర్నీ షాక్ కి గురి చేస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది అని వార్తలు వస్తున్నాయి. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సాక్షన్ లో రూ.5వేలు మాత్రమే విత్ డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఐదువేలకు మించి విత్ డ్రా చేస్తే కచ్చితంగా ఛార్జీలు పడనున్నాయి,ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలు ప్రతిపాదించింది. ఇక పలు లావాదేవీలపై ఇంటర్ చేంజ్ చార్జీలు పెంచాలి అని తెలిపింది. 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం ఛార్జీలు పెంచాలని నివేదికలో పేర్కొంది, ఇక చాలా వరకూ ఆన్ లైన్ పేమెంట్లకు ఇప్పుడు జనం ఇంకా మారాల్సిందే అంటున్నారు నిపుణులు.