బ్రేకింగ్ — ఆగస్టు 31 వరకు ఈ ప్రాంతంలో లాక్ డౌన్ సర్కార్ కీలక ప్రకటన

బ్రేకింగ్ -- ఆగస్టు 31 వరకు ఈ ప్రాంతంలో లాక్ డౌన్ సర్కార్ కీలక ప్రకటన

0
86

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది, 25 లక్షల కేసులు నమోదు అయ్యాయి, ఇక 18 లక్షల మంది రికవరీ అయ్యారు, ఇంకా 6,72,215 మంది చికిత్స తీసుకుంటున్నారు 49 వేల మరణాలు సంభవించాయి.

అయితే అన్ లాక్ పిరియడ్ మన దేశంలో నడుస్తోంది, ఈ సమయంలో భారీగా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకుంటున్నాయి, తాజాగా మరో రాష్ట్రం లాక్ డౌన్ ప్రకటన చేసింది.

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న సంపూర్ణ లాక్డౌన్ను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా అధికారులు మంత్రులతో చర్చించి సీఎం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్లో అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కఠినంగా లాక్ డౌన్ అమలు చేయనున్నారు,ఇక సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు, మెడికల్ అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు ఈ సమయంలో రావాలి అని తెలిపారు. మణిపూర్ లో ఇప్పటి వరకూ 4198 కేసులు నమోదు అయ్యాయి.