బ్రేకింగ్‌..బీజేపీ ఎమ్మెల్యే మృతి

బ్రేకింగ్‌..బీజేపీ ఎమ్మెల్యే మృతి

0
86

ఈ లాక్ డైన్ వేళ ప‌లు విషాద వార్త‌లు వినాల్సి వ‌స్తోంది, ప‌లువురు వైర‌స్ సోకి చికిత్స తీసుకుంటు మ‌ర‌ణిస్తుంటే మ‌రికొంద‌రు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణిస్తున్నారు, తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మ‌ర‌ణం అంద‌రిని క‌లిచివేసింది..భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ దత్తా ఒడిశాలోని భువనేశ్వర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు.

ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారంనాడు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయ‌న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ట‌, దీంతో అక్క‌డ ప్ర‌జ‌లు అంద‌రూ షాక్ లో ఉన్నారు.ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయ‌న మ‌ర‌ణం పై తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

బాలాసోర్ సదర్ నియోజవకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మదన్ మోహన్ దత్తా అక్క‌డ ఎమ్మెల్యేగా గెలుపొందారు, ప్ర‌జ‌ల‌కు బాగా ద‌గ్గ‌ర అయిన వ్య‌క్తి…ఆయనుకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మధన్ మోహన్ మరణంతో బీజేపీ శ్రేణులు దుఃఖంలో మునిగిపోయాయి.