బ్రేకింగ్ – బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ - బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు

0
87

సోషల్ మీడియాలో పొలిటికల్ కామెంట్లు కాస్త హీట్ పుట్టిస్తున్నాయి ఇటీవల, ముఖ్యంగా కొన్ని రోజులుగా హీరో సిద్దార్థ్ నిత్యం వార్తల్లో నిలుస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల ఆయన పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

దీంతో తన ఫోన్ నెంబర్ లీక్ చేసి తనని బెదిరిస్తున్నారు అని తన కుటుంబాన్ని చంపుతాము అని కాల్ చేసి బెదిరిస్తున్నారు అని ఈ విషయాన్ని కూడా సిద్దార్ద్ తెలియచేశారు.

 

బీజేపీ నాయకులే ఈ పని చేశారంటూ వరుసపెట్టి బీజీపీ నేతలపై సిద్దార్థ్ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.

బీజేపీ యువ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన.. యంగ్ ఎంపీ తేజస్వి సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి. టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కంటే దశాబ్దకాలపు ముందు వ్యక్తి. ఈ ట్వీట్ను సేవ్ చేయండి అంటూ ట్వీట్ చేసి రచ్చ చేశారు.

 

 

దీంతో సిద్ధార్థ్పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అసలు సిద్దార్ద్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు దీనిపై రచ్చ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో.

సిద్దార్థ్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సిగ్గుండాలి నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట సిగ్గుండాలి అని ట్వీట్ చేశారు, దీనిపై ఇప్పుడు బీజేపీ నేతలు ఇటు విష్ణు అభిమానులు సిద్దార్ద్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.