బ్రేకింగ్ – కార్లు వాడుతున్న వారికి కీలక అప్ డేట్ – ఫాస్టాగ్ పై కీలక నిర్ణయం

బ్రేకింగ్ - కార్లు వాడుతున్న వారికి కీలక అప్ డేట్ - ఫాస్టాగ్ పై కీలక నిర్ణయం

0
107

జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది.. దేశ వ్యాప్తంగా ఎవరైనా జాతీయ రహదారులపై వెళ్లిన సమయాల్లో కచ్చితంగా టోల్స్ దగ్గర ఫాస్టాగ్ వాడాల్సిందే.. ఇక మీ కారు పాతది అయినా కొత్తది అయినా ఫాస్టాగ్ చేసుకోవాల్సిందే..
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది అని కేంద్రం తాజాగా తెలిపింది.

ఇప్పటి వరకూ కొత్త వాహనాలకే ఇది , కాని ఇప్పుడు పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. అంతే కాదు పాత వాహనానికి మీరు ఫాస్టాగ్ చేయిస్తేనే మీకు ఫిట్ మెంట్ సర్టిఫికెట్ రవాణాశాఖ ఇస్తుంది, ఈ కొత్త రూల్ పెట్టారు
దేశంలో ప్రతీ నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే.

ఇక నాలుగు చక్రాల వాహనాలు ఉన్న ప్రతీ ఒక్కరు దీనిని విధిగా పాటించాల్సిందే, బ్యాంకులు ఆర్టీఏ ఆఫీసుల్లో వీటిని ఇస్తున్నారు, సాధారణ ఫీజు చెల్లించి వీటిని తీసుకోవచ్చు, ఇక ఫాస్టాగ్ ఉంటే మీకు కచ్చితంగా డిజిటల్ పేమెంట్లు చేయవచ్చు అలాగే ప్రాసెస్ మరింత ఈజీ అవుతుంది.