బ్రేకింగ్ – చైనా కీల‌క నిర్ణ‌యం కంపెనీల‌కు కీల‌క సూచ‌న‌

బ్రేకింగ్ - చైనా కీల‌క నిర్ణ‌యం కంపెనీల‌కు కీల‌క సూచ‌న‌

0
86

ప్ర‌స్తుతం భార‌త్ చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్దితులు ఉన్నాయి, ఈ స‌మ‌యంలో ఆర్దికంగా కంపెనీల‌పై ఇది ఎఫెక్ట్ ప‌డేలా ఉంది, ఇటు భార‌తీయులు కూడా చైనా ప్రొడ‌క్ట్స్ కొన‌ద్దు అని అంటున్నారు, పెద్ద క్యాంపెయిన్ న‌డుస్తోంది, ఇటు మంత్రులు కూడా ప‌లు వ‌స్తువులు చైనావి ఆహ‌ర‌ప‌దార్దాలు కూడా బ్యాన్ చేయాలి అని కోరుతున్నారు.

భారతదేశంలో చైనాకు వ్యతిరేకంగా వాతావరణం ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదు. ఈ క్రమంలో చైనా తమ దేశ కంపెనీలకు సందేశాలు ఇచ్చింది.భారతదేశంలో పనిచేస్తున్న అన్ని సంస్థలకు సందేశాలు పంపింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు సంక్షోభం పరిష్కరించబడే వరకు, భారతదేశంలో పెట్టుబడులు మరియు ఉత్పత్తిని ఆపడం గురించి ఆలోచించాలంటూ తమ కంపెనీలను కోరింది.

ఒక‌వేళ వారు ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేసి వ్యాపారాలు లేక‌పోతే ఓ ప‌క్క ప‌రిశ్ర‌మ‌ల‌కు గ‌డ్డు ప‌రిస్దితులు వ‌స్తాయి, అందుకే తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది అని ప్ర‌ముఖ ప‌త్రిక క‌థ‌నం రాసింది, మొత్తానికి చాలా వ‌ర‌కూ ఇది సెల్ ఫోన్ టాయ్స్ బిజినెస్ పై అప్పుడే రెండు రోజులుగా ప్ర‌భావం చూపిస్తోందంటున్నాయి ప‌లు రేటింగ్ ఏజెన్సీలు.