బ్రేకింగ్ – చైనాలో మ‌రో కొత్త వైర‌స్ – పెరుగుతున్న కేసులు

బ్రేకింగ్ - చైనాలో మ‌రో కొత్త వైర‌స్ - పెరుగుతున్న కేసులు

0
143

చైనాలో కొత్త వ‌స్తువులు ఆవిష్కృతం అవుతాయి, కొత్త వైర‌స్ లు అక్క‌డే పుడ‌తాయి, ఈ క‌రోనా నుంచి ఇంకా ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డ‌లేదు కాని ప్ర‌తీ నెలా ఏదో ఓ కొత్త వైర‌స్ పుడుతూ వ‌స్తోంది, ,చైనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, ఈ వార్త‌లు వింటే మ‌ళ్లీ ఎలాంటి ముప్పు వ‌స్తుందా అని అంద‌రూ బెంబెలెత్తుతున్నారు.

క‌రోనా ఇంకా మ‌ర‌క పోకుండానే, చైనాలో మ‌రో కొత్త‌ర‌కం వైర‌స్‌ను అక్క‌డి వైద్యులు గుర్తించారు. ఈ వైర‌స్ క్ర‌మంగా ప్ర‌బ‌లుతుండ‌టంతో ఇప్ప‌టికే ప్రావిన్స్ న‌గ‌రంలో దాదాపు ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు చైనా తెలిపింది, ఇప్ప‌టికే 65 మందికి ఈ వైర‌స్ సోకింది.

ఇది బన్యావైరస్ కేటగిరీలోకి వచ్చే ఫెల్బో వైరస్ కు చెందిన కొత్త స్ట్రెయిన్ అని అంటున్నారు నిపుణులు
పశువుల శరీరానికి పట్టుకుని, రక్తాన్నిపీల్చుకునే నల్లి వంటి ఏసియన్ టిక్ ద్వారా ఈ వైర‌స్ వ‌స్తోంది, అందుకే ప‌శువుల‌కి దూరంగా ఉంటున్నారు జ‌నం

అయితే జ్వ‌రం త‌ల‌నొప్పి కాళ్లు ఒళ్లు నొప్పులుద‌ద్ద‌ర్లు అల‌స‌ట వ‌స్తాయి, ఇంకా వైర‌స్ బాడీలో ‌తీవ్రమైతే ప్లేట్ లెట్లు , తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం, కడుపు, పేగు సమస్యల వంటి ల‌క్ష‌ణాలు కన్పిస్తాయి, సీటీలో కంటే అక్క‌డ గ్రామాల్లో ఇది క‌నిపిస్తోంది, అందుకే వారికి ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నారు.