బ్రేకింగ్… సీఎం జగన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా…

బ్రేకింగ్... సీఎం జగన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా...

0
93

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి త్వరలో శాశ్వితంగా రాజకీయాలకు దూరం అవుతారా అంటే అవుననే అంటున్నారు అనంతపురం జిల్లా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప….

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మూడు రాజధానుల ఏర్పాటు అధికార వైసీపీని ముంచబోతోందని అన్నారు… మూడు రాజధానుల ప్రతిపాదన అనేద దుర్మార్గమైన ఆలోచన అని అన్నారు… ఈ ఆలోచన ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శాశ్వితంగా రాజకీయాలకు దూరమవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు…

అన్న దమ్ములలాగ ఉన్న ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ గతంలో రెండు ముక్కలుగా విడదీసిందని అన్నారు… విడదీసిన కాంగ్రెస్ కు ఏపీలో ఏ గతి పట్టిందో ఇప్పుడు అదే గతి వైసీపీ కూడా పడుతుందని అన్నారు… శంకర నారాయణ విశాఖపట్నం రాజధానికి అనువైనది కాదని సీఎం మీటింగ్ లో తెలియజేయాల్సి ఉందని అన్నారు…