లక్షలాది మంది ప్రాణాలను తీసుకుంటున్న మాయదారి కరోనా వైరస్ జన్మ స్థలం చైనాలో గుట్టు చప్పుడు కాకుండా మస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది… వ్యాక్సిన్ తయారీ కోసం అనేక దేశాలు మల్లగుల్లాలు పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దానిని తయారు చేయడమే కాదు వ్యాక్సినేషన్ కు కూడా నిర్వహిస్తోంది…
ఇప్పటిదాకా 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది… అత్యవసర పరిస్థితుల కింద వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు పేర్కొంది… ఈ వ్యాక్సినేషన్ సందర్భంగా ఏ ఒక్కరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్లు సమాచారం లేదని చైనా జాతీయ ఫార్మా సూటికల్స్ గ్రూప్ సినోఫార్మ్ చైర్మన్ లియూ జింగెన్ తెలిపారు…
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొందరిలో అనారోగ్య లక్షణాలు కనిపించినప్పటికీ వాటి తీవ్రత నామమాత్రమేనని పేర్కొన్నారు… అయితే కరోనా వైరస్ ను నిర్మూలించడానికి మాస్ వ్యాక్సిన్ ను చేపట్టిన విషయాన్ని చైనా భహిరంగంగా వెల్లడించలేదు… లియూ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బయటపడింది…