బ్రేకింగ్ – కోవిడ్ పేషెంట్లు అందరికీ ఫుడ్ కిట్స్ -ఉచితంగా హోమ్ డెలివరీ

బ్రేకింగ్ - కోవిడ్ పేషెంట్లు అందరికీ ఫుడ్ కిట్స్ -ఉచితంగా హోమ్ డెలివరీ

0
111

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది…పాజిటీవ్ కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి, రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి.. దేశంలో ఈ సమయంలో చాలా స్టేట్స్ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి… మరికొన్ని రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఇక తమిళనాడు కర్ణాటక లో లాక్ డౌన్ ప్రకటన వచ్చేసింది.

 

కేరళ మాత్రం ఫస్ట్ వేవ్ నేర్పిన గుణపాఠంతో ఆక్సిజన్ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. ఇక కేసులు పెరుగుతున్న కారణంతో

కేరళలో 8 రోజుల పూర్తి లాక్ డౌన్ విధించారు. ఈ సమయంలో ఓ కీలక ప్రకటన చేశారు…కోవిడ్ పేషెంట్లు అందరికీ ఫుడ్ కిట్స్ ను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తామని సీఎం విజయన్ ప్రకటించారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు సీఎం.

 

రాష్ట్రంలోని ఆహారం, నిత్యావసరాలు, పళ్లు, కాయగూరలు, డెయిరీ ప్రాడక్ట్స్, మాంసం, చేపలు, జంతువుల దాణా, పౌల్ట్రీ, బేకరీలు తెరిచే ఉంటాయి. ఇక ఇవన్నీ సాయంత్రం 7.30 వరకూ ఉంటాయి.. ఆ తర్వాత దుకాణాలు క్లోజ్ చేయాలి, ఎవరికి ఆహార కొరత లేకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.