బ్రేకింగ్ —- డేంజ‌ర్ భారీ భూకంప ముప్పు పొంచి ఉంది

బ్రేకింగ్ ---- డేంజ‌ర్ భారీ భూకంప ముప్పు పొంచి ఉంది

0
91

ప్ర‌కృతి ప్ర‌కోపిస్తోంది అని చెప్పాలి, ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వైర‌స్ తో అత్య‌ధికంగా కేసులు పెరుగుతున్నాయి, ఈ స‌మ‌యంలో పెను ప్ర‌మాదాలు పొంచి ఉన్నాయి, ఇక దిల్లీ ద‌గ్గ‌ర ప‌లు ప్రాంతాల్లో భూకంపాలు కూడా సంభ‌వించాయి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోయిన రిక్ట‌ర్ స్కేలుపై అత్య‌ధికంగా న‌మోదు అవుతున్నాయి.

దేశ రాజధాని దిల్లీలో భారీ భూకంప ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ తెలిపింది. గత మే 29 నుంచి ఇప్పటి వరకు దిల్లీలోని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో 14 సార్లు భూమి కంపించింది. అక్క‌డ జ‌నం కూడా భ‌య‌ప‌డుతున్నారు.

ఈసారి దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. భూగర్భ రాతి ఫలకల్లో ఉన్న పీడన శక్తి అత్యధికంగా విడుదల కావడం వల్ల ఈ ప్రాంతంలో తరచు ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతాల్లో వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి అని చెబుతున్నారు, ఇంట్లో ఉంటే భూకంపం టెన్ష‌న్ ,బ‌య‌ట‌కు వ‌స్తే వైర‌స్ టెన్ష‌న్ అని భ‌య‌ప‌డుతున్నారు హ‌స్తిన ప్ర‌జ‌లు.