బ్రేకింగ్ దేశంలో స్టార్ట్ అయిన రైల్వే స‌ర్వీసులు ఇవే

బ్రేకింగ్ దేశంలో స్టార్ట్ అయిన రైల్వే స‌ర్వీసులు ఇవే

0
83

దాదాపు 40 రోజులుగా మ‌న దేశంలో రైలు ,విమాన, బ‌స్సు ప్ర‌యాణాలు నిలిపివేసింది కేంద్రం, ఈ స‌మ‌యంలో ప్ర‌జార‌వాణాకు చాలా ఇబ్బంది ప‌డ్డారు జ‌నం, సొంత వాహ‌నాలు ఉన్న వారికి కూడా అనుమ‌తి లేదు దీంతో ఎక్క‌డ వారు అక్కడ చిక్కుకుపోయారు.

కాని ప్ర‌యాణికుల‌కి రైల్వే శాఖ నేటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించనున్నాం అని తెలిపింది, ఈ రోజు సాయంత్రం నుంచి టికెట్ రిజ‌ర్వేష‌న్ల‌కు అనుమ‌తి ఇస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి దేశంలో 15 గమ్యస్థానాలకు మొత్తం 30 సర్వీసులను నడపనుంది రైల్వేశాఖ‌.

న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు నడవనున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్ ద్వారా మాత్ర‌మే టికెట్స్ బుక్ చేసుకోవాలి, అంతేకాని స్టేష‌న్ల‌లో టికెట్ ఇవ్వ‌రు, ఈ ట్రైన్స్ బ‌య‌లుదేరే ముందు పూర్తిగా టెస్టులు చేసిన త‌ర్వాత మాత్ర‌మే అనుమ‌తి ఇస్తారు ట్రైన్ ప్ర‌యాణానికి.