తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.. నువ్వా నేనా అనేలా పోటికి దిగుతున్నారు నేతలు, ఇటు డీఎంకే అన్నాడీఎంకే కమల్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ముందుకు వస్తున్నాయి…మరో సారి గెలుపు మాధే అని అన్నా డీఎంకే అంటోంది.. ఇక ఈసారి గెలవాలి అని డీఎంకే చూస్తోంది.. కమల్ కూడా ఈసారి గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇటీవల జైలు నుంచి విడుదలైన శశికళ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రోల్ పోషిస్తారు అని అందరూ అనుకున్నారు.. అంతేకాదు అమ్మ పోటి చేసిన చోటు నుంచి పోటీచేస్తారు అని అందరూ భావించారు.. అయితే తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే కి మద్దతుగా అందరూ ఉండాలి అని పార్టీ గెలుపుకి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.నాకు పదవులు చేయాలి అని లేదు.. అమ్మ ఉన్నప్పుడు లేదు లేనప్పుడు లేదు.. ఇక ఆమె పార్టీ గెలవాలి అని కోరుకుంటున్నాను అని ఆమె తెలిపారు.