బ్రేకింగ్ — ముఖ్యమంత్రిగా కేటీఆర్ పట్టాభిషేకానికి ఆ డేట్ ఫిక్స్ చేశారా ?

-

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.. ముఖ్యమంత్రిగా కేటీఆర్ రాబోతున్నారు అని.. అయితే దీని గురించి మీడియాలోనే కాదు టీఆర్ఎస్ శ్రేణులు కూడా మాట్లాడుతున్నారు.. మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది, అయితే వచ్చే నెలలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని డేట్ కూడా ఫిక్స్ చేశారు అని తెలంగాణ పొలిటికల్ కారిడార్ లో వార్తలు వైరల్అవుతున్నాయి.

- Advertisement -

మరి కేసీఆర్ ఏ ముహుర్తం ఫిక్స్ చేశారు అంటే ఫిబ్రవరి 18వ తేదీన కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.. ఫిబ్రవరి 18న ఎందుకు అంటే ఆ రోజు రథసప్తమి. హిందూ సంప్రదాయాల్లో ఆరోజుకు ఎంతో విశిష్టత కలిగి ఉంది, ఆరోజు ఏ పని చేసినా తిరుగు ఉండదు. అందుకే ఈ రోజుని ఫిక్స చేశారు అంటున్నారు.

ఈ రోజు చేపట్టే పనులు దిగ్విజయంగా కొనసాగుతాయని నమ్మకం. అలాంటి రోజున కేటీఆర్కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇప్పటికే దీని గురించి రాష్ట్రంలో అందరూ చర్చించుకుంటున్నారు, ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా మారనున్నారట. మరి చూడాలి ఇది ఎంత వరకూ వాస్తవమో .

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...