ఇరు దేశాలు ఉన్నాయి అంటే కచ్చితంగా సరిహద్దు దగ్గర వివాదాలు వస్తాయి, అయితే చాలా మంది సామరస్య పూరకంగా చేసుకుంటే మరికొందరు వీటిని తగాదాలుగా మార్చుకుంటారు..
ఖచ్చితమైన సరిహద్దు లేకపోవడమే చాలా వరకూ వివాదాలకు కారణం, తాజాగా ఇలాంటి వివాదం ఒకటి ఉంది.
ఈజిప్టు, సుడాన్ దేశాల మధ్య బోర్డర్ గొడవ మరోలా ఉంది. ఈజిప్టు, సుడాన్ సరిహద్దుల్లో ఎర్రసముద్రం ప్రాంతంలో 2వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బిర్ తావిల్ అనే ప్రాంతం ఉన్నది. ఇది చాలా మందికి ముఖ్యంగా ఆరెండు దేశాలకు తెలిసిన ప్రాంతం, ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు
కాని ఇక్కడ ఎవరూ నివశించడం లేదు.. ఈ ప్రాంతం ఈజిప్టు కు చెందిందని సుడాన్ వాదిస్తుంటే, కాదు సుడాన్ కు చెందిన ప్రాంతం అని ఈజిప్టు చెప్తున్నది. దీంతో ఎవరూ తమకు ఇది వద్దు అని వదులుకున్నాయి. మొత్తానికి ఈ ప్లేస్ ఎవరూ తీసుకోకపోవడంతో అలాగే ఉండిపోయింది.