బ్రేకింగ్ – ఐదో విడత లాక్ డౌన్ లో సడలింపులు ఏమిటి??

బ్రేకింగ్ - ఐదో విడత లాక్ డౌన్ లో సడలింపులు ఏమిటి??

0
91

కేంద్రం విధించిన లాక్ డౌన్ కేవలం మరో మూడు రోజుల్లో ముగుస్తుంది.. ఈ సమయంలో కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తుందా లేదా అనేదానిపై చాలా మంది ఆలోచన చేస్తున్నారు, హస్తిన వర్గాలు చెప్పేదాని ప్రకారం లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంది, అయితే మరిన్ని సడలింపులు అయితే ఇవ్వనున్నారు అని తెలుస్తోంది

ఇక ప్రార్ధనా మందిరాలు జూన్ 1 నుంచి కొన్ని చోట్ల తెరిచే అవకాశం ఉంది, పరిమిత సంఖ్యలోనే ఆన్ లైన్ దర్శనం టికెట్స్ తీసుకుని వారికి దర్శనం కల్పించనున్నారు, ఇక జిమ్ ల విషయంలో కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది, అలాగే దేశీయ విమానాలు తిరిగేలా చేస్తారు, ఇక మరో 200 కొత్త రైల్ సర్వీసులు పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం, జూన్ లో రైళ్లు సర్వీసులు మరిన్ని పెంచుతారు.

రిజర్వేషన్ టికెట్ ఉంటేనే అనుమతించేలా ప్రయాణాలు చేయనున్నారు, ఇక బస్సులు ప్రైవేట్ బస్సులు సిటీ బస్సులు అంతరాష్ట్ర సర్వీసులపై కేంద్రం రాష్ట్రాలకే నిర్ణయ అధికారం ఇవ్వనుంది, కేసుల పరిస్దితి బట్టీ వాటికి అనుమతి నిర్ణయాలు ఆయా స్టేట్స్ తీసుకోనున్నాయి..కంటెయిన్ మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జిమ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి అని తెలుస్తోంది, మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి.