ఏపీలో బీజేపీ సరికొత్త స్ట్రాటజీలతో దూసుకుపోతోంది, ముఖ్యంగా ఆపార్టీలో చేరాలి అనే నేతలను చేర్చుకుంటున్నారు.. ఇటు తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీ కాస్త దూకుడు మీద ఉంది అనే చెప్పాలి ఏపీలో, ముఖ్యంగా సౌత్ లో ఏపీ తెలంగాణపై కమలం పార్టీ ఫోకస్ చేసింది.. ఎవరైనా అధికార పార్టీ లేదా ప్రధాన పత్రిపక్ష పార్టీ నుంచి నేతలు వస్తే చేర్చుకోవాలి అని చూస్తున్నారు.
తాజాగా బీజేపీలోకి వైసీపీ నాయకురాలు చేరారు.
కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీకి మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి గుడ్ బై చెప్పారు, ఆమె బీజేపీలో చేరారు, పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నీరజారెడ్డి చేరికతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో కమలం పార్టీ మరింత స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు.
ఇక ఆమె పొలిటికల్ ఫ్రొఫైల్ చూస్తే, నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు, ఇక 2014 ఎన్నికల్లో దూరంగా ఉన్నారు, 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు ఆమె.. అయితే ఇప్పుడు అనూహ్యాంగా ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు.