కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తోంది, ఎక్కడ చూసినా దారుణంగా కేసులు వస్తున్నాయి.. పేదలకు చాలా వరకూ ఉపాధి కూడా కరువు అయింది, వలస కూలీలు తమ సొంత ఇళ్లకు ఊర్లకు వెళుతున్నారు..ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అండగా నిలిచేందుకు మళ్లీ ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేయనుంది.
గత ఏడాది కరోనా లాక్ డౌన్ వేళ దీనిని అమలు చేశారు మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ వేళ దీనిని అమలు చేస్తారు, మే, జూన్ ఐదు కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేయనుంది కేంద్రం. మొత్తం దేశంలో 80 కోట్ల మందికి ఈ బియ్యం అందుతాయి, అంతేకాదు దీని కోసం 26 వేల కోట్ల ఖర్చు చేయనుంది.
గత ఏడాది కరోనా కేసులు పెరిగిన వేళ లాక్ డౌన్ అమలు చేశారు.. ఈ సమయంలో ప్రతి పేదవాడికి ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 5 కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. మార్చి నుంచి 2020 నవంబర్ వరకు ఇచ్చారు, ఇప్పుడు మళ్లీ కేంద్రం పేదలకు సరఫరా చేయనుంది.