ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC ప్రయాణికులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఇక మీరు బస్సు జర్నీ చేసే సమయంలో మీ బస్ మిస్ అయినా, అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా మీరు తర్వాత సర్వీసులో వెళ్లాలి అని భావించినా అవన్నీ వచ్చే రోజుల్లో సాధ్యం అవుతాయి.
ప్రయాణికులు మరింత సులువుగా బస్సు టిక్కెట్ బుక్ చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఇక బస్సు స్టార్ట్ అయిన తర్వాత అందులో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో కూడా తెలుస్తుంది, తర్వాత స్టాప్ లో ఈజీగా ఎక్కవచ్చు, అలాగే ఆ బస్సు ఎక్కడ ఉందో ఇక తెలుస్తుంది.
మీరు బస్సు మిస్ చేసుకుంటే .. ఆ మార్గంలో వచ్చే మరో సర్వీస్లోకి టిక్కెట్ మార్చుకునే అవకాశం అందుబాటులోకి తేచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు… ఇలా దాదాపు 15 సర్వీసులు ఒకే యాప్ లో అందించేలా చేస్తున్నారు.
యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ను ఆర్టీసీ రెడీ చేస్తోంది. అంతేకాదు బస్సు ఏ టైమ్కు పికప్ పాయింట్కు వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు పార్శిల్ బుకింగ్ కు కూడా ఇదే యాప్ లో చేసుకోవచ్చు. త్వరలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.