వాహనదారులకు ఇప్పటికే కేంద్రం ఓ విషయం చెప్పింది.. కచ్చితంగా నేషనల్ హైవేలపై వెళ్లేవారు టోల్ దాటేవారు ఫాస్టాగ్ వాడాల్సిందే.. దాని ద్వారా టోల్ ఫీ చెల్లించాలి అని కండిషన్ పెట్టింది. ఒకవేళ ఎవరైనా ఫాస్టాగ్ పెట్టించుకోకపోయినా వారు కచ్చితంగా డబుల్ ఛార్జ్ కట్టాలి అని కండిషన్ పెట్టారు.. దీంతో చాలా వరకూ వాహనదారులు ఫాస్టాగ్ పెట్టుకుంటున్నారు. - Advertisement -
ఇక మరో కొత్త విషయం ఏమిటి అంటే.. ఫాస్టాగ్ వాడుతున్న వారికి మరో గుడ్ న్యూస్ చెబుతున్నారు… దీనికి అనేక ఫీచర్లు జోడిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, పీఎన్జీ వంటి వీటిని కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించాలని ఆలోచిస్తోందట కేంద్రం. దీంతో ఆ డిజిటల్ పద్దతిలో మీరు మరింత ఈజీగా పెట్రోల్ డిజీల్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు వాహనదారులు పెట్రోల్, డీజిల్ వంటివి మాత్రమే కాకుండా పార్కింగ్ ఫీజు చెల్లింపులకు కూడా ఫాస్టాగ్‌ను ఉపయోగించొచ్చు. ఇక దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేస్తున్నారు, ఇక ఇప్పటికే హైదరాబాద్ లో కూడా ఎయిర్ పోర్టుల్లో ఫాస్టాగ్ పార్కింగ్ సేవలు వచ్చాయి. ఇక తర్వాత ముంబై చెన్నై బెంగళూరు ఇలా వరుసగా చేసుకుంటూ వస్తారని తెలుస్తోంది.
|
|
బ్రేకింగ్ – ఫాస్టాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్ మరో కొత్త ఫీచర్
-