అన్నీరంగాలు డిజిటల్ బాటలోకి అడుగు పెడుతున్నాయి, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ రంగ సంస్ధలు కూడా ఆన్ లైన్ అలాగే డిజటల్ సేవలు విస్తరిస్తున్నాయి, ఫిర్యాదులు కూడా ఇప్పుడు ఆన్ లైన్ లో స్వీకరిస్తున్నారు, వాట్సాఫ్ ద్వారా పలు సమస్యలు పరిష్కారం చేస్తున్నారు, తాజాగా ప్రభుత్వ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాట్సాప్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తోంది.
తమ చందాదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ను ఆ సంస్థ ఇటీవల ప్రారంభించింది.
మరి ఆ సర్వీసు గురించి తెలుసుకుందాం, ఇప్పటి వరకూ వీటి ద్వారా 1,64,040 కు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
భారత్లో ఉన్న మొత్తం 138 ప్రాంతీయ EPFO కార్యాలయాల పరిధిలో వాట్సాప్ హెల్ప్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఖాతాదారులు ఈ సర్వీసులని వాడుకుంటున్నారు.
వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి?
ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
https://www.epfindia.gov.in/site_en/index.php ఇదే ఆవెబ్ సైట్ ఇక మీరు ఓపెన్ చేసిన తర్వాత
మీకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయానికి ఒక వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ కేటాయిస్తారు.అక్కడ డేటాలో కనిపిస్తుంది
వెబ్ సైట్ లో పైన రైట్ సైడ్ వాట్సాప్ సింబల్ ఉంటుంది
అందులో మీకు నెంబర్లు కనిపిస్తాయి
ఆ నెంబర్ కు మీరు ఫిర్యాదు సమస్య పంపవచ్చు