దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ జరుగుతోంది ఇప్పటికే లక్షలాది మందికి టీకా అందించారు, అయితే తాజాగా పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఉచితంగా టీకా ఇస్తాము అని ప్రకటించాయి.. అంతేకాదు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకి కూడా ఈ టీకా అందిస్తాము అని తెలిపాయి. తాజాగా రిలయన్స్ కూడా ఓ ప్రకటన చేసింది.
పెట్రో కెమికల్స్ నుంచి టెలికం వరకూ పలు రంగాల్లో విస్తరించిన రిలయన్స్, తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి కుటుంబాలకు పిల్లలకు పేరెంట్స్ కు అందరికి ఉచితంగా కరోనా టీకా ఇస్తాము అని తెలిపింది. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్ పర్సన్ నీతా అంబానీ ఈ విషయం తెలిపారు.
ఇక ఆమె ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకి ఈ విషయం తెలిపారు.అందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని అందులో వివరించారు, ఇక ఉద్యోగుల ఆరోగ్యం సంతోషం తమకు ముఖ్యం అని తెలిపారు ఆమె, ఇక అందరూ కరోనా మార్గదర్శకాలు తప్పక పాటించాలి అని తెలిపారు.