డీటీహెచ్ కంపెనీలో టాటా స్కై నూతన ఒరవడి సృష్టించింది అనే చెప్పాలి, అద్బుతమైన ఆఫర్లు ఇస్తూ సరికొత్తగా మార్కెట్లో నిలుస్తుంది, అయితే తాజాగా తన కస్టమర్లకు ఓ గొప్ప ఆఫర్ ఇచ్చింది.. రెండు నెలలపాటు ఉచితంగా టీవీ చూసే ఆఫర్ తీసుకువచ్చింది. దీని కోసం టాటా స్కై యూజర్లు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది.
మీరు ఇలా చేస్తే టాటా స్కై క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ఇక ఈ ఆఫర్ పేమెంట్ చేయాలి అని అనుకునేవారు అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12 నెలల సబ్స్క్రిప్షన్పై 2 నెలల రీచార్జ్ మొత్తాన్ని క్యాష్బ్యాక్ రూపంలో పొందొచ్చు.
ఒకవేళ మీరు ఆరు నెలలకే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. యూజర్లకు ఒక నెల రీచార్జ్ క్యాష్బ్యాక్ రూపంలో వస్తుంది.
మీరు ఏడాదికి తీసుకుంటే కచ్చితంగా రెండు నెలలు ఆఫర్ వస్తుంది, దీనిపై పూర్తి వివరాలు కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు, అంతేకాదు యాప్ వెబ్ సైట్లలో రీచార్జ్ చేసుకోండి.యూజర్ల అకౌంట్లలోకి క్యాష్బ్యాక్ మొత్తం 7 రోజుల్లోగా వచ్చి చేరుతుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కొత్త కార్డులకి కాదు పాత కార్డులు పాతకస్టమర్లకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.