బ్రేకింగ్ ‍‍‍‍‍‍….గుడ్డలు విప్పుతారా లోకేష్ సవాల్

బ్రేకింగ్ ‍‍‍‍‍‍....గుడ్డలు విప్పుతారా లోకేష్ సవాల్

0
85

తెలుగుదేశం పార్టీ పై నిత్యం విమర్శలు చేసే వైసీపీ నేతలు తమపై కావాలనే టార్గెట్ పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి టీడీపీ యువ నేత నారాలోకేష్, గత ప్రభుత్వంలో తాము అగ్రిగోల్డ్ ఆస్తులు దోచేసాం అని విమర్శించారు, ఇప్పుడు నాకు అగ్రీ గోల్డ్ కు సంబంధం ఉంది అని వైసీపీ విమర్శలు చేస్తోంది, పైగా స్పీకర్ గా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేత పైనా… ఎమ్మెల్సీగా ఉన్న నాపైనా నిందారోపణలు చేయడం సముచితం కాదు. మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానంటే నాదొక సవాల్. అని నారాలోకేష్ తెలియచేశారు.

ఈ అగ్రిగోల్డ్ విషయంలో నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా. మీరు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే మీరేం చేస్తారో కూడా చెప్పండి. అని సవాల్ విసిరారు, మీరు చేసినవి తప్పు అని తెలిస్తే మీ అధ్యక్షుడి గుడ్డలూడదిసి రాజకీయాల నుంచి తప్పిస్తారా అని సవాల్ చేశారు లోకేష్ . మీ ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా తనపై విమర్శలు ఆరోపణలు బురదచల్లే ప్రయత్నం చేయద్దు అన్నారాయన.