బ్రేకింగ్ రెండు రాష్ట్రాల్లోలకు హై అలర్ట్

బ్రేకింగ్ రెండు రాష్ట్రాల్లోలకు హై అలర్ట్

0
88

ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి మన దేశానికి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి… ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఆరుగురు లస్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించినట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి.

శ్రీలంక మీదుగా కోయంబత్తూరులో చొరబడినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో కోయంబత్తూరులో పోలీస్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రదేశాలు, ప్రముఖ రాజకీయ నాయకులు విదేశీ రాయబారాల కార్యాలాయాలు ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే ప్రమాధం ఉందని హెచ్చరిస్తున్నారు.

చెన్నైతో పాటు ప్రధాన ప్రాంతాల్లో తమిళనాడు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు… చెన్నై, కొయంబత్తూరులో హోటల్స్ రైల్వే స్టేషన్స్ థియేటర్స్ షాపింగ్ మాల్స్ తో పాటుగా ఆద్యాత్మిక ప్రదేశాల్లో గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు.