కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతూనే ఉంది .. ఈ సమయంలో చాలా స్టేట్స్ లో స్కూళ్లు కాలేజీలు ఓపెన్ కాలేదు, అయితే చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా స్కూళ్లు మూసివేసి ఉన్నాయి, అయితే ఏపీలో కూడా ఇటీవల స్కూళ్లు కాలేజీలు తెరుచుకున్నాయి, ఇక డిల్లీ అలాగే పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న కారణంగా స్కూళ్లు తెరవడం లేదు.
అయితే మరో స్టేట్ కీలక నిర్ణయం తీసుకుంది..మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లు తెరిచే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతులను మార్చి 31 వరకూ ప్రారంభించరాదని నిర్ణయించింది. ఇక ఎనిమిది అలాగే ఏడు ఆరు ఐదు క్లాసులు పరీక్షలు కూడా రద్దు చేసింది.
తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఇక 1 నుంచి 8 వ క్లాసు విద్యార్దులకి మార్చి 31 వరకూ పాఠశాలలు ప్రారంభించరు, అయితే వీరిని తర్వాత తరగతులకి ఎలా ప్రమోట్ చేస్తారు అంటే వారికి ప్రాజెక్ట్ వర్క్ ల ద్వారా ప్రమోట్ చేస్తారు.. ఇక పది ఇంటర్ వారికి మాత్రం క్లాసులు నిర్వహించి పరీక్షలు పెడతారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇదే వర్తిస్తుంది.