బ్రేకింగ్ – హైదరాబాద్ లో మందుబాబులకి చేదువార్త

బ్రేకింగ్ - హైదరాబాద్ లో మందుబాబులకి చేదువార్త

0
94

హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.. ప్రతీ సెగ్మెంట్లో నాయకులు ప్రచారం ఓ రేంజ్ లో చేస్తున్నారు బిర్యానీ పాయింట్లు టీ పాయింట్లు ప్లెక్స్ వర్కులు ఓ రేంజ్ లో వ్యాపారాలు సాగుతున్నాయి.. మరో పక్క అక్కడక్కడ మబ్బు వాతావరణం ఉంటున్నా నేతలు ఉన్నా సమయంలో వీలైనంత ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్యం భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎన్నికలు అంటేనే బీరు బిర్యానీ కామన్ ..సో ఇక్కడ ఇదే జరుగుతోంది, ఇక మరో మూడు రోజులు ఉంది ఈ ప్రచార పర్వానికి, ఈ సమయంలో మందుబాబులకి ఓ చేదు వార్త.

జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ ఎలక్షన్స్ తర్వాతే మద్యం దుకాణాలు ఓపెన్ అవుతాయి. సో మొత్తం మూడు రోజులు లిక్కర్ బంద్ .. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు గ్రేటర్ పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. అంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు షటర్ క్లోజ్ అవుతుంది. ఇక డిసెంబర్ 1 న ఓటింగ్,4న కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తి అయ్యాక షటర్ తెరుస్తారు.