నేటి నుంచి హైదరాబాద్ లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.. ఇక రాత్రి 9 తర్వాత అత్యవసరం అయిన వారు మాత్రమే రోడ్లపైకి రావాలి.. ఇష్టం వచ్చినట్లు తిరగడానికి లేదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే విమానాలు రైళ్లు బస్సుల్లో ప్రయాణం చేయాలి అని అనుకునే వారు కచ్చితంగా టికెట్ అనేది చూపించాల్సిందే.. కార్లు క్యాబ్ లు ఆటోలు ఈ సమయంలో వాడుకోవచ్చు.. అయితే సాధారణ బిజినెస్ ఏది కూడా 9 తర్వాత చేయడానికి లేదు.
తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు..చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ తిరుగుతున్న సమయాల్లో ఈ మార్పులు అయితే ఉంటాయి, ప్రయాణికులు దీనిని గమనించాలి.
ఈ రోజు నుంచి ఈ నెల 30 తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. మొదటి రైలు ఉదయం 6.30 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. ప్రయాణికులు మాస్కు, శానిటైజర్లు వాడాలని మెట్రో అధికారులు సూచించారు. సో కచ్చితంగా ఈ టైమింగ్ తెలుసుకోండి.