బ్రేకింగ్ – హైదరాబాద్ బేగం బజార్ లో వ్యాపారులు కీలక నిర్ణయం

బ్రేకింగ్ - హైదరాబాద్ బేగం బజార్ లో వ్యాపారులు కీలక నిర్ణయం

0
116
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి… ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే దేశంలో లక్ష కేసులు దాటుతున్నాయి. ఇప్పుడు ఏపీ లో తెలంగాణలో ఏ స్టేట్ లో చూసుకున్నా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి… ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే హైదరాబాద్ నగరం గురించి చెప్పాలి.. జీహెచ్ ఎంసీ పరిధిలో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.
హైదరాబాద్ లోని బేగంబజార్ నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ వేలాదిమంది కొనుగోలు దారులు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుంటారు. కొన్ని వందల షాపులు ఇక్కడ ఉంటాయి.. అనేక జిల్లాల నుంచి ఇక్కడకు వ్యాపారులు వస్తూ ఉంటారు.. దీంతో ఇక్కడ బిజీగా ఉంటుంది వ్యాపారులు కస్టమర్లతో …అందుకే ఇక్కడ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
బేగంబజార్ మార్కెట్లో 100 మంది వ్యాపారులకు కరోనా సోకింది. ఇక కేసులు ఎక్కువగా నమోదు కావడంతో వ్యాపారుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది…ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మార్కెట్ ఓపెన్ చేసి ఉంటుందని.. ఇక కేసులు తగ్గే వరకూ ఇదే సమయం పాటిస్తాము అని తెలిపింది, అందరూ వ్యాపారులు ఈ సమయంలోనే షాపులు తెరవాలి అని తెలిపారు.