బ్రేకింగ్ – భార‌త ఉద్యోగుల‌ను తొల‌గించిన చైనా కంపెనీ

బ్రేకింగ్ - భార‌త ఉద్యోగుల‌ను తొల‌గించిన చైనా కంపెనీ

0
81

ఇప్పుడు భార‌త్ చైనా మ‌ధ్య చాలా వ‌ర‌కూ ఉద్రిక్త ప‌రిస్దితులు ఉన్నాయి, ఈ స‌మ‌యంలో చైనా వ‌స్తువులు బ్యాన్ చేయాలి అని, భార‌త్ లో వాటి అమ్మ‌కాలు చేయ‌కూడ‌దు అని పిలుపు వ‌స్తోంది, ఈ స‌మ‌యంలో చైనా యాప్స్ కూడా తీసేయాల‌ని చాలా మంది‌ కోరుతున్నారు.

ఈ స‌మ‌యంలో మధ్యప్రదేశ్‌లోని భాల్‌ఘాట్‌లో ఉన్న ముడి ఖనిజం తవ్వకం విధుల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులను చైనాకు చెందిన ఓ కంపెనీ తొలగించింది. కాని కంపెనీ మాత్రం తాము వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి అని ఈ నిర్ణ‌యం తీసుకున్నాం అని చెబుతోంది.

అయితే లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనే తమతో పనులు చేయించారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఇక్క‌డ కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న 72 మందిని ఎలాంటి కారణం చూపకుండానే విధుల్లో నుంచి తొలగించింది. దీంతో వారు క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు, గ‌తంలో అడ్వాన్సుగా ఒక్కొక్క‌రికి 5 వేలు చొప్పున కంపెనీ అందించిందని దీంతో చేతులు దులుపుకుంది అని వారు ఫిర్యాదు చేశారు.