బ్రేకింగ్ – అంతర్జాతీయ విమానరాకపోకలపై క్లారిటీ

బ్రేకింగ్ - అంతర్జాతీయ విమానరాకపోకలపై క్లారిటీ

0
75

ఈనెల 25 నుంచి దేశీయ విమానాలు తిరగనున్నాయి, ఇప్పటికే రెండు నెలలుగా ఈ విమానయాన సంస్ధలు చాలా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయాయి, ఒక్క విమానం కూడా తిరగకపోవడంతో ఎలాంటి ఆదాయం లేదు, ఇక ప్రజా రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయింది, కేవలం విదేశాల్లో చిక్కుకున్న వారిని మాత్రమే తీసుకురావడానికి ఈ సర్వీసులు వాడారు.

ఇప్పుడు మన దేశంలో విమానాలు తిరగనున్నాయి.. అయితే ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్ ఎప్పుడు తిరుగుతాయి అనే విషయంలో మాత్రం ఇంకా చాలా మందికి అనేక ఆలోచనలు ఉన్నాయి, ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి అని భావిస్తున్నారు, కాని దీనిపై క్లారిటీ వచ్చింది.

అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర పౌరవిమానయానశాక మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గినట్టు అనిపిస్తే.. జూన్ మధ్యలో గానీ, జులై చివరిలో కానీ ఈ సర్వీసులు ప్రారంభింస్తామని అని అన్నారు. సో దీని బట్టి జూలై లో ఇవి తిరుగుతాయి అని క్లారిటీ అయితే వస్తోంది.