ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మందు బాబులకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు, మరీ ముఖ్యంగా మద్యపాన నిషేదం దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే, ఇప్పటికే ప్రభుత్వం నడుపుతోంది వైన్ షాపులు, ఇతర రాష్ట్రాల నుండి ఏపీ లోపి మద్యం అనుమతించే ప్రసక్తే లేదని చెబుతున్నారు అధికారులు.
కాని కొందరు యదేఛ్చగా మద్యం తెచ్చుకుంటున్నారు, ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ కొత్తగా జీవో నెంబర్ 310ని విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఆంక్షలు పెట్టింది…సరైన పరిమిట్లు లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు ఇక అవకాశం లేదు, ఎవరైనా తెస్తే వారిపై కేసులు నమోదు చేస్తారు.
అంతేకాదు గతంలో ఇచ్చిన ఛాన్స్ 3 మద్యం బాటిల్స్ ఇతర రాష్ట్రాల నుండి తెచ్చుకునేందుకు కూడా తాజాగా అనుమతి ఇవ్వలేదు. ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్రం నిబంధనల ప్రకారం అనుమతి ఉంది. రాష్ట్రాల నుంచి స్టేట్ పాలసీ ప్రకారం ఉండదు, ఇక మందు బాబులు ఇది మర్చిపోకండి.