బీజేపీ సీనియర్ నాయకుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కోడలు సుహారిక వయసు 38 ఆమె గురువారం మృతిచెందారు. కన్నా రెండో కుమారుడి భార్య సుహారిక.
హైదరాబాద్ గచ్చిబౌలి హిల్రిడ్జ్ విల్లాస్లో నివాసం ఉంటున్న సుహారిక.. ఉదయం స్థానిక మీనాక్షి బాంబూస్లోని మిత్రుడు పవన్రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ వికాస్, వివాస్, ప్రవీణ్ సుహారిక సోదరి భర్త వీరందరూ కలిసి పార్టీ చేసుకున్నారు.
అయితే అందరూ సరదాగా ఉన్న సమయంలో, ఉదయం 11గంటల 30నిమిషాలకు ఉన్నట్టుండి సుహారిక కుప్పకూలారు. రాయదుర్గంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి తరలించారు. కాని ఆమెఅప్పటికే మరణించారు. ఈ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవు అని కుటుంబ సభ్యులు తెలిపారు, ఆమెకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు అని తెలుస్తోంది.సుహారిక కన్నా రెండో కుమారుడు ఫణీంద్ర భార్య. వీరిది ప్రేమవివాహం ఆమె స్వస్థలం నెల్లూరు జిల్లా.