గడిచిన పది రోజులుగా చూస్తే దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి, ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి, ఇక ఏపీ తెలంగాణలో చూస్తే పలు పాఠశాలలు కాలేజీ్లో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి.. స్కూల్లో విద్యార్దులు కాలేజీ స్టూడెంట్స్ టీచర్లు కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు… ఈ సమయంలో తెలంగాణలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు శాసనసభ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. స్కూళ్లలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులతో కూడా చర్చించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపట్నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గతంలో తెలంగాణలో ఎలాగైతే ఆన్ లైన్ తరగతులు జరిగాయో అలాగే జరగనున్నాయి..ఆన్లైన్ క్లాసులు యథాతథంగా కొనసాగుతాయి. కచ్చితంగా మాస్కులు ధరించి శానిటైజేషన్ చేసుకుని భౌతిక దూరం పాటించాలి అని కోరారు.