బ్రేకింగ్ – ఎల్.ఐ.సీ కీలక నిర్ణయం – పాలసీదారులు తప్పక తెలుసుకోండి

బ్రేకింగ్ - ఎల్.ఐ.సీ కీలక నిర్ణయం - పాలసీదారులు తప్పక తెలుసుకోండి

0
94

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు దారుణంగా వస్తున్నాయి, ఎక్కడ చూసినా భారీగా కేసులు నమోదు అవుతున్న పరిస్దితి, రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల కేసులు వస్తున్నాయి…ఇక చాలా వరకూ ఆఫీసులు కూడా సమయం తగ్గించేశాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా వరకూ 50 శాతం మంది సిబ్బంది రోస్టర్ పద్దతిలో వస్తున్నారు.. ఇక బ్యాంకులు కూడా సమయం తగ్గించాయి.

 

 

ఇక కొన్ని స్టేట్స్ లో అయితే చాలా వరకూ రెండు మూడు గంటల వరకూ మాత్రమే పనిచేస్తున్నాయి, మన దేశంలో అతి పెద్ద బీమా సంస్ధ ఎల్ ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీ కార్యాలయాలు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రకటించింది.

 

ప్రతి శనివారం కార్యాలయాలను మూసివేయనున్నట్లు తెలిపింది. మరి ఇది ఎప్పటి నుంచి అమలు అంటే మే 10 నుంచి అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎల్ఐసీ కార్యాలయాలు వర్క్ చేస్తాయి, ఇక పాలసీదార్లు ప్రిమియం కట్టేవారు, కొత్త గా బీమా కోసం వచ్చేవారు, ఏజెంట్లు అందరూ గమనించగలరు.