చాలా మంది ఇంటిలో మద్యం స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు, ముఖ్యంగా బయటకు రోజూ వెళ్లి తెచ్చుకోరు, నెలకి ఓసారి తెచ్చుకుని కేసుల రూపంలో దాచుకుంటారు, ఇలా ధనవంతులు చాలా మంది చేస్తారు అనేది తెలిసిందే.
ఒకేసారి ఇంట్లో ఎక్కువ మద్యం నిల్వ చేసుకునే వారికి సర్కారు షాక్ ఇచ్చింది, అయితే ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఉత్తరప్రదేశ్లో..
మద్యం ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని సర్కారు చెప్పింది.. ఇక ఇలా లైసెన్స్ లేకుండా కేసుల కొద్ది ఇంట్లో మద్యం ఉంటే కేసులు పెడతారు.. జైల్లో పెడతారు, ఇక కొత్త నిబంధనలు తీసుకువచ్చారు.
తాజాగా ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. మరి ఎంత మద్యం ఇంటిలో ఉంచుకోవచ్చు అంటే, ఒక్కొక్కరు ఇంటిలో దాదాపు ఆరులీటర్ల మద్యం ఉంచుకోవచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఇక మీరు అంతకంటే ఎక్కువ నిల్వ చేసుకోవాలి అంటే కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఈ లైసెన్స ఫీజు మీకు ఏడాదికి 12 వేలు ఉంటుంది, అలాగే మీరు 51 వేలు సెక్యూరిటి డిపాజిట్ చేయాలి.