దేశంలో ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది, ఇక వైరస్ ని కట్టడి చేయడానికి ఇంకా లాక్ డౌన్ అవసరం అని నిపుణులు చెబుతున్నారు, ఇక రేపటితో లాక్ డౌన్ ముగుస్తుంది, మరి ఈ సమయంలో ఇంకా లాక్ డౌన్ పొడిగించాలి అని చూస్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే ఆరు స్టేట్స్ లాక్ డౌన్ ఈ నెల 30 వరకూ ప్రకటించాయి.
అయితే కేంద్రం జోన్ల వారీగా లాక్ డౌన్ ప్రకటిస్తుంది అని తెలుస్తుంది…లాక్ డౌన్ 2.0 గా పీఎంఓ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్నింటికి సడలింపు ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. మూతపడిన ఆహర పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కొన్ని గంటలు పని చేసే అవకాశం ఉంటుంది. ఇక కార్మికుల పనివేళలు పెంచే ఆలోచన చేస్తున్నారు, అదనపు పనివేళలకు జీతం ఇవ్వనున్నారు.
వలస కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి వారి స్వస్థలాలకు చేర్చనున్నారు. నిత్య అవసర దుకాణాలు పనివేళలు పెంచుతారు.. నిత్యావసరాల సరుకుల రవాణా చేసే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు.
సామాజిక దూరం పాటించాలి అనే కండిషన్ పెడతారు, కచ్చితంగా మాస్క్ ధరించే నియమం తెస్తారు.