ఇప్పుడు వైరస్ వ్యాప్తి దారుణంగా ఉంది, ఈ సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు చాలా వరకూ లాక్ డౌన్ అమలు చేయాలి అని అందరూ కోరుతున్నారు, అందుకే లాక్ డౌన్ అమలు చేయాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
అయితే లాక్ డౌన్ వల్ల ప్రయోజనం ఏమిటి, అసలు సర్కారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేది నిపుణులు ఏం చెబుతున్నారు అంటే, ఇలా లాక్ డౌన్ 20 రోజులు పెట్టడం వల్ల వైరస్ పాజిటీవ్ కేసులు సంఖ్య తక్కువగా ఉంటుంది, అలాగే వైరస్ సంక్రమణ ఒకరి నుంచి మరొకరికి తగ్గుతుంది, వేగంగా ఇంటి దగ్గర టెస్టులు నిర్వహిస్తారు.
ఈ సమయంలో బయటకు కేసులు వస్తాయి, వారికి చికిత్స అందిచవచ్చు, ఇలా ఇరవై రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేవారు సంఖ్య పెరుగుతుంది, అలాగే కొత్త కేసులు వచ్చినా ఎక్కువ రాకుండా ఉంటాయి, ఇటు వైద్యులపై కూడా అంత ప్రెజర్ పెరగదు,ఇలా సులువుగా ఇరవై రోజుల్లో చాలా వరకూ వైరస్ కట్టడి చేయవచ్చు అని అంటున్నారు నిపుణులు.