బ్రేకింగ్ – మాజీ మంత్రి మాణిక్యాలరావు క‌న్నుమూత

బ్రేకింగ్ - మాజీ మంత్రి మాణిక్యాలరావు క‌న్నుమూత

0
94

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి చాలా జీవితాల‌ను నాశ‌నం చేసింది, కొంద‌రు నాయ‌కుల‌కి కూడా క‌రోనా సోకింది, అలాగే కొంద‌రు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు, మ‌రికొంద‌రు క‌న్నుమూశారు, తాజాగా ఏపీలో మాజీ మంత్రి క‌రోనాతో మ‌ర‌ణించ‌డం అంద‌రిని విషాదంలో నెట్టింది.

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా వల్ల కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన… నెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఆయ‌న ప‌రిస్దితి విష‌మించ‌డంతో ఆయ‌న కాసేప‌టి క్రితం క‌న్నుమూశారు.

ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. తాడేప‌ల్లిగూడెం వాసుల‌కి సుప‌రిచితులు,సౌమ్యుడిగా ఆయ‌న‌కు పేరు ఉంది, ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఆయ‌న‌కు కూడా వ‌స్తాయి అంటూ గ‌తంలో ఆయ‌న పేరు వినిపించింది, కీల‌క నేత‌ను కోల్పోయామ‌ని బీజేపీ నాయ‌కులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.