బ్రేకింగ్ – మాజీ మంత్రి వైసీపీ సీనియ‌ర్ నేత క‌న్నుమూత

బ్రేకింగ్ - మాజీ మంత్రి వైసీపీ సీనియ‌ర్ నేత క‌న్నుమూత

0
93

వైసీపీలో విషాదం అల‌ముకుంది, పార్టీ సినియ‌ర్ లీడ‌ర్ మాజీ మంత్రి సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు తెలియ‌చేశారు.

ఆయ‌న పై ఉమ్మ‌డి ఏపీలో రికార్డ్ కూడా ఉంది, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు.

ఆయ‌న 1968 లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు.. ఉత్త‌రాంధ్రా కీల‌క నేత‌గా ఎదిగారు, గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. ఢిల్లీలో కూడా ఆయ‌న చ‌క్రం తిప్పిన నేత‌, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు అంద‌రితో ఆయ‌న‌కు ప‌రిచ‌యాలు ఉన్నాయి.. పార్టీనాయ‌కులు సంతాపం తెలిపారు.