కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాల అతలా కుతలం అవుతున్నాయి… ఈ మాయదారి మహమ్మారిని అడ్డుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు… అయినా కూడా డ్రాగన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఈ వైరస్ కు మందు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు… అయితే ఈ క్రమంలోనే మరో సంచలన విషయం బయటకు వచ్చింది…
ఇటీవలే జరిపిన ఓ అధ్యాయనంలో మహమ్మారిగా ప్రబలే ఓ కొత్త రకమైన స్వైన్ ఫ్లూ వైరస్ ను వారు కనుగొన్నారు… జీ4 అని పిలువబడే ఈ వైరస్ జన్యుపరంగా హెచ్1యన్1 జాతినుంచి వచ్చిందని అంటున్నారు… ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు.. దీన్ని తొలిదశలోనే అరికట్టాలని అంటున్నారు… పరిశోధకులు 10 చైనా ప్రావిన్సులు పశు వైద్య ఆసుపత్రిలోని పందుల కలేబరాల నుంచి 30 వేల నాజల్ శ్వాబ్స్ ను తీసుకుని 179 స్వైన్ ఫ్లూ వైరస్ ను ఐసోలేట్ చేశారు…
వాటిలో ఎక్కువగా కొత్తరకం వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు… ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు… ఇప్పటికే ఈ వైరస్ చైనా పందుల నుంచి మనుషులకు సోకిందట.. ఈ వైరస్ మూడు ప్రత్యేకమైన జాతుల సమ్మేళనం అని అంటున్నారు… ఈ వైరస్ కు విరుగుడు లేదని అంటున్నారు… ఒక వేల మనుషలుకు సక్రమిస్తు ఫ్లూ వైరస్ ల మాదిరిగా తగ్గదని అంటున్నారు…