మద్యపాన నిషేదం దిశగా ముందుకు అడుగులు వేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు చెప్పారు, అదే విధంగా ముందుకు వెళుతున్నారు, అయితే ఈ కరోనా సమయంలో మద్యానికి దూరంగా ఉంటారు అని భారీగా మద్యం ధరలు పెంచింది ఏపీ సర్కార్.
కాని మందు బాబులు మద్యానికి బానిసలు అయ్యి, శానిటైజర్లు కూడా తాగేస్తున్నారు, దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం. . మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు తెలిపారు.
దీంతో ఇప్పటికే భారీగా తగ్గించిన షాపులతో ముందుకు వెళుతూ మద్యం ధరలు 40 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది..చూడాది దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందో.