బంగారం కొనాలి అని చూస్తున్నారా… గత పది రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి…పుత్తడి ధరలు తగ్గుతుంటే వెండి ధర కూడా ఇలాగే తగ్గుతోంది .. ఫ్రిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు మార్చిలో పుత్తడి ధరలు భారీగా తగ్గాయి.
నేడు పుత్తడి భారీగా తగ్గింది కాని వెండి మాత్రం మార్కెట్లో కాస్త పెరుగుదల స్వల్పంగా నమోదు చేసింది, మరి రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గింది. దీంతో రేటు రూ.45,440కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గడంతో రూ.41,650కు తగ్గింది.
బంగారం తగ్గితే మరి వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది.
వెండి ధర కేజీకి రూ.100 పెరిగింది. దీంతో రేటు రూ.71,100కు చేరింది.. ఇక బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు… ఇక భారీ లాభాల కోసం చూసేవారు ఇప్పుడు పెట్టుబడి పెట్టడం అనవసరం అంటున్నారు అనలిస్టులు.