బ్రేకింగ్ – మే 7 న వారికి కేంద్రం గుడ్ న్యూస్

బ్రేకింగ్ - మే 7 న వారికి కేంద్రం గుడ్ న్యూస్

0
78

ఈ వైర‌స్ తో ప్ర‌పంచంలో అంద‌రూ ఇబ్బంది ప‌డుతున్నారు, దాదాపు 36 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకింది, ఇక విదేశాల‌లో కూడా చాలా మంది చిక్కుకుపోయారు, ముఖ్యంగా వ‌ల‌స కూలీలను స్వ‌గ్రామాల‌కు తీసుకువ‌స్తున్న భార‌త ప్ర‌భుత్వం, తాజాగా విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ని కూడా భార‌త్ కు తీసుకువ‌చ్చేందుకు సిద్దం అవుతోంది.

ఉపాధి కోసం, ఉద్యోగ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న భారతీయులకు కేంద్రం తాజాగా శుభవార్త చెప్పింది.మే 7 నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్ప‌టికే వారి వివ‌రాలు హై క‌మిష‌న్ ద్వారా విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ఆ దేశాల్లో ప్ర‌తినిధుల ద్వారా తెలుసుకుంటోంది.

ఎవ‌రు వ‌స్తారో వారి జాబితా సిద్దం చేస్తోంది, దాని ప్రకారం వారికి ఆ దేశ అధికారుల‌తో చ‌ర్చించి, అక్క‌డ నుంచి ఇండియా తీసుకువ‌స్తారు, ఈ విమానాలు, నౌకల్లో రావాలనుకునే భారతీయులు రవాణా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. క‌చ్చితంగా వారికి టెస్ట్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే ఇక్క‌డ‌కు తీసుకువ‌స్తారు, వ‌చ్చిన త‌ర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే.