దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏకంగా లక్ష కేసులు నమోదు అవుతున్నాయి… సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి.
అయితే ముంబైలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి… ఇక మహారాష్ట్రాలో చాలా ప్రాంతాలు లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే ..పలు నగరాల్లో రాత్రి పూట కర్ఫూ విధిస్తున్నారు.
అయితే తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వారాంతపు లాక్డౌన్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఇక షాపులు థియేటర్లు ఇలా ఏవి తెరవరు గత లాక్ డౌన్ ఎలా అమలు చేశారో ఇలాగే అమలు చేస్తారు.
భోపాల్, ఇండోర్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూలు ఇప్పటికే అమలవుతున్నాయి. ఇక కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా చేస్తున్నారు. ఇక బయటకు ఎవరైనా వస్తే కచ్చితంగా మాస్కు ధరించాల్సిందే అనే రూల్ తీసుకువచ్చారు,
గడచిన 24 గంటల్లో 4,000కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో స్టేట్ లో కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.