బ్రేకింగ్ న్యూస్ … బీజేపీ నేత రఘునందన్‌రావు పై అత్యాచారం కేసు

బ్రేకింగ్ న్యూస్ ... బీజేపీ నేత రఘునందన్‌రావు పై అత్యాచారం కేసు

0
96

బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అంటే తెలియని వారు ఉండరు.. రాజకీయంగా ఆయనకు మంచి పేరు ఉంది.. బీజేపీ తరపున తన వాయిస్ బాగా వినిపిస్తారు. అలాంటి నాయకుడిపై తాజాగా అత్యాచారం కేసు నమోదు అయింది.

జ్యోతినగర్‌కు చెందిన బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి రఘునందన్‌పై ఫిర్యాదు చేసింది…గత 12 సంవత్సరాలుగా తనకి నరకం చూపిస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది..కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని కమిషనర్ ఎదుట వాపోయింది.

దీంతో అతనిపై పోలీస్ కేసు నమోదు అయింది.. అసలు జరిగింది చూస్తే ఆమె 2003లో భర్తపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. అప్పుడు కేసు గురించి పిలిచి అత్యాచారం చేశాడు అని తెలిపింది ఈ విషయం బయట పెడితే నెట్ లో చిత్రాలు పెడతా అని బెదిరిస్తున్నాడని ఆవేదన చెందింది. దీనిపై ఆయన స్పందించారు ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా ప్రభుత్వమే ఈ పని చేస్తోందని ఆరోపించారు.