బ్రేకింగ్ న్యూస్— 5 కీల‌క విష‌యాలు చెప్పిన కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్--- 5 కీల‌క విష‌యాలు చెప్పిన కేసీఆర్

0
94

తెలంగాణ‌లో ఏప్రిల్ 30 వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు… ప్ర‌ధానికి కూడా ఇదే విష‌యాన్ని తెలియ‌చేస్తాము అని వెల్ల‌డించారు.. అన్నీ రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని భావిస్తున్నాయ‌ని వెల్ల‌డించారు.

ఇక రైతుల ద‌గ్గ‌ర పూర్తిగా ధాన్యం మొక్క జొన్న కొంటాము అని తెలిపారు కేసీఆర్, కేంద్రం నుంచి నిధులు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాము అని అన్నారు, ఇక రైళ్లు బ‌స్సులు విమానాలు కూడా తిరిగే అవ‌కాశం లేద‌ని, ఈనెల 30 త‌ర్వాత వైర‌స్ ప్ర‌భావం త‌గ్గితే, ద‌శ‌ల వారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తాం అన్నారు.

శనివారం సాయంత్రానికి 503 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 14మంది మృతి చెందగా. 96 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 393 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వారంతా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇక ఎట్టిప‌రిస్దితిలో వైన్స్ షాపులు తీయ‌ము అన్నారు, అలాగే ప్రైవేట్ ల్యాబ్స్ కు ఈ క‌రోనా టెస్ట్ కి అనుమ‌తి కూడా ఇవ్వ‌ము అని తెలిపారు కేసీఆర్.