ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నామినేటెడ్ పదవుల విషయంలో పలువురు పార్టీనేతలకు పెద్ద పీట వేస్తున్నారు.. అయితే తాజాగా వైసీపీ నేతలకే కాకుండా ఓ బీజేపీ నాయకురాలికి పదవి ఇవ్వడం పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే దీనికి కారణం కూడా ఉంది అని తెలుస్తోంది.
బీజేపీ మహిళా నేత, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు సోదరుడి కుమార్తె సంచిత గజపతిరాజుకు జగన్ సర్కారు నామినేట్ పదవి ఇచ్చింది. తాజాగా బీజేపీ నాయకురాలు సంచితని సింహాచలం ఆలయ పాలకమండలి సభ్యురాలిగా నియమించింది జగన్ సర్కార్.
అయితే ఇక్కడ పాలక మండలిలో వారి కుటుంబానికి ఎప్పుడూ పెద్ద పీట వేస్తారు, అలాగే గజపతుల కుటుంబానికి విశాఖ విజయనగరం జిల్లాలో మంచి పేరు ఉంది ఇక ఆమెకి తాజాగా ఈ పదవి అందుకే ఇచ్చారు అని తెలుస్తోంది, 2018లో ఆమె బీజేపీలో చేరారు.. ఆనంద గజపతిరాజు, ఉమ దంపతుల కుమార్తె అయిన సంచిత గజపతి రాజు ముందు నుంచి బీజేపీ వైపే అడుగులు వేశారు.విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలకు ఇటీవల ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు అయ్యాయనే విషయం తెలిసిందే.